Cyclone Michaung | మిచాంగ్ తుఫాన్ (Michaung Cyclone) ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి చెన్నై మహానగరం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు, విమాన, రైలు సర్వీసులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.
వర్షానికి తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు చెన్నైలోని కనత్తూర్లో కొత్తగా నిర్మించిన గోడ కూలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈదురు గాలులకు భారీ వృక్షాలు సైతం ఎక్కడికక్కడ రోడ్లపై కూలిపోతున్నాయి. పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో భారీగా వరద వచ్చి చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం రాత్రి 11 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక చెన్నైలోని పలు ప్రాంతాల్లో వీధుల్లో పార్క్ చేసిన వాహనాలు వర్షపు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐఎండీ ప్రకారం… గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వలసరవక్కంలో 154.2 మి.మీటర్ల వర్షంపాతం నమోదు కాగా, నుంగంబాక్కంలో 101.7 మి.మీ, షోలింగనల్లూర్లో 125.7 మి.మీ, కోడంబాక్కంలో 123.3 మి.మీ, మీనంబాక్కంలో 108 మి.మీ వర్షపాతం నమోదైంది.
Also Read..
Cyclone Michaung | మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. అతలాకుతలమైన చెన్నై నగరం
Tanzania | వరదలతో అతలాకుతలమైన టాంజానియా.. కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి
Munich | మునిచ్ను ముంచెత్తిన హిమపాతం.. పూర్తిగా స్తంభించిన జనజీవనం