Munich | ఐరోపాలోని పలు దేశాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. హంగేరీ, స్విడన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఎస్టోనియా, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో గత కొన్ని రోజులుగా భారీగా హిమపాతం కురుస్తోంది. రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జర్మనీ (Germany)లో మంచు తుఫాను (Snowstorm) కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే మునిచ్ విమానాశ్రయం (Munich Airport) పూర్తిగా మంచులో కూరుకుపోయింది. దీంతో సుమారు760 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Minich Snow3
తొలుత శనివారం మధ్యాహ్నం వరకూ విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా తుఫాను ప్రభావం తగ్గకపోవడంతో ఆదివారం ఉదయం 6 గంటల వరకూ కూడా విమానాలను అధికారులు నిలిపివేశారు. మునిచ్ నగరంలోని బస్సులు, రైలు సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడి సెంట్రల్ రైల్వే స్టేషన్‌ను మూసివేసినట్లు జర్మనీ జాతీయ రైల్వే కంపెనీ వెల్లడించింది. దీంతో ఇక్కడి సెంట్రల్ రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. మంచు తుఫాను ప్రభావంతో జర్మనీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్విస్ ఆర్థిక రాజధాని జ్యూరిచ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ హిమపాతం కారణంగా చాలా ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో పలు విమానాలను అధికారులు రద్దు చేశారు.
Minich Snow2
తీవ్ర హిమపాతం కారణంగా ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ బుండెస్లిగలో బెరిన్ మునిచ్ – యూనియన్ బెర్లిన్ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. దక్షిణ జర్మనీ లోని మునిచ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ కూడా హిమపాతం కారణంగా రద్దైంది. మ్యాచ్ ఆరంభానికి ఐదున్నర గంటల ముందే మంచు తీవ్రంగా కురవడంతో ఆటగాళ్ల భద్రత రీత్యా ఆటను నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.స్డేడియానికి రాకపోకలు సాగించే రహదారిపై మంచు విపరీతంగా కురిసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దైన ఈ మ్యాచ్‌ను త్వరలోనే మళ్లీ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
Minich Snow4
Also Read..
Ram Charan | మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో చరణ్ పూజలు
Tanzania | వరదలతో అతలాకుతలమైన టాంజానియా.. కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి
IPL 2024 | ఐపీఎల్ 17వ సీజన్‌కు మరో స్టార్ బౌలర్ దూరం.. కారణం అదేనా..?