IPL 2024 | ఐపీఎల్ 17వ సీజన్‌కు మరో స్టార్ బౌలర్ దూరం.. కారణం అదేనా..?
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే.. కొందరు స్టార్ ఆటగాళ్లు 2024 ఎడిషన్‌కు దూరం అయ్యే చాన్స్ ఉంది. ఈ జాబితాలో తాజాగా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)....
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే.. కొందరు స్టార్ ఆటగాళ్లు 2024 ఎడిషన్‌కు దూరం అయ్యే చాన్స్ ఉంది. ఈ జాబితాలో తాజాగా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) చేరనున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలగాలని ఆర్చర్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(England Cricket Board) కోరింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున వర్క్‌లోడ్ పడకుండా ఉండేందుకు ఐపీఎల్ ఆడొద్దని అతడిని అభ్యర్థించింది. అయితే.. ఈ విషయంపై ఆర్చర్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఈ స్టీడ్స్టర్ అందుకు అంగీకరిస్తే ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు పెద్ద షాక్ తగిలినట్టే.
జోఫ్రా ఆర్చర్

ప్రపంచంలోని మేటి ఫాస్ట్ బౌలర్లలో ఆర్చర్ ఒకడు. ఈ స్టార్ పేసర్ 2019 వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో బెన్ స్టోక్స్(Ben Stokes) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటే.. సూపర్ ఓవర్లో ఆర్చర్ సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు. దాంతో, అతడు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఐపీఎల్ 2018 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. 2022 మినీ వేలంలో ఈ పేసర్‌ను రూ.10 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. అయితే.. గాయం కారణంగా ఆర్చర్ టోర్నీ మధ్యలోనే స్వదేశం వెళ్లిపోవడంతో.. అతడి స్థానంలో ముంబై క్రిస్ జోర్డాన్‌ను ఆడించింది. ఈ మధ్యే కోలుకున్న ఆర్చర్ వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నటీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు కీలకం కానున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Tanzania | వరదలతో అతలాకుతలమైన టాంజానియా.. కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి
-
Neha MaliK | పసుపురంగు చీరలో కవ్విస్తున్న నేహా మాలిక్..
-
Actor Nani | కడప పెద్ద దర్గాను సందర్శించిన హీరో నాని
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

