Ram Charan | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) మైసూర్ (Mysore)లోని చాముండేశ్వరి అమ్మవారిని (Sri Chamundeshwari temple ) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాగా, చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం చిత్ర బృందంతో కలిసి చరణ్ ఆలయాన్ని సందర్శించారు. చరణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అడ్వానీ నటిస్తోంది. ఓ సాధారణ యువకుడు అసాధారణ నాయకుడిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరిస్తూ చక్కటి సామాజిక సందేశంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Global star @AlwaysRamCharan visited and received blessings at the Sri Chamundeshwari temple in Mysore.#RamCharan #GameChanger #RC16 #GlobalStarRamCharan pic.twitter.com/RWQu2A8xjM
— SR Promotions (@SR_Promotions) December 4, 2023
#RamCharan @AlwaysRamCharan @RamCharanFamily @RAMCHARANsRule @charan_fans @TweetRamCharan pic.twitter.com/PM3A4lPQIM
— MeeMoviesLover (@MeeMovies) December 4, 2023
Also Read..
Cyclone Michaung | మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. అతలాకుతలమైన చెన్నై నగరం
Tanzania | వరదలతో అతలాకుతలమైన టాంజానియా.. కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి
Cyclone Michaung | మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. అతలాకుతలమైన చెన్నై నగరం