బెంగళూరు: ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. (Children Kidnapped) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. నిందితులు పోలీసులపై దాడి చేయడంతో వారిపై కాల్పులు జరిపారు. కిడ్నాపైన ఇద్దరు పిల్లలను రక్షించారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 23న బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు అథని పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. స్కూల్ నుంచి తిరిగి వచ్చి నానమ్మ వద్ద ఆడుకుంటున్న నాలుగు, మూడేళ్ల తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లారు. కారులో అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఇది చూసి షాకైన పిల్లల నానమ్మ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ కారును గుర్తించారు. ఒక చోట ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా నిందితులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన ఒక వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కిడ్నాపైన పిల్లలను పోలీసులు రక్షించి వారి కుటుంబానికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన పిల్లల తండ్రి నిందితులకు ఏడు కోట్లు బాకీ పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బు కోసం అతడి పిల్లలను వారు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, పిల్లల కిడ్నాప్‌నకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Karnataka: Kidnapping of two children, aged 3 and 4 years, in Belagavi district was caught on CCTV.
Belagavi police launched a manhunt for two kidnappers who arrived in a car, entered a home with weapons, kidnapped two children and escaped in a car. The parents of the… pic.twitter.com/D36U4plaf3
— ANI (@ANI) October 25, 2024