ఇంఫాల్, సెప్టెంబర్ 19 : మణిపూర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఒక వ్యక్తి జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు వెళ్తున్న 33 అస్సాం రైఫిల్స్ జవాన్లపై నంబోల్ సకల్ లీకై వద్ద శుక్రవారం సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మికంగా దాడిచేసి కాల్పులు జరిపాడు.
ఈ దాడిలో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దారుణమైన ఈ హింసాత్మక చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. దాడిని మాజీ సీఎం బీరేన్ సింగ్ ఖండించారు. ఇది రాష్ర్టానికి క్రూరమైన దెబ్బగా పేర్కొన్నారు.