TMC MP | టీఎంసీ రెబల్ గ్రూప్‌లో 19 మంది ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ.. ఎన్డీయేకు మద్దతు
TMC MP : టీఎంసీలో రెబల్స్ వ్యవహారం రాజకీయంగా ఇంకా కలకలం రేపుతోంది. ఎవరు, ఎప్పుడు పార్టీని వీడుతారో అనే ఉత్కంఠ కలుగుతోంది. తాజాగా టీఎంసీకి చెందిన 19 మంది రెబల్ ఎంపీలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు.
TMC MP : టీఎంసీలో రెబల్స్ వ్యవహారం రాజకీయంగా ఇంకా కలకలం రేపుతోంది. ఎవరు, ఎప్పుడు పార్టీని వీడుతారో అనే ఉత్కంఠ కలుగుతోంది. తాజాగా టీఎంసీకి చెందిన 19 మంది రెబల్ ఎంపీలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు. కేంద్రంలోని ఎన్డీయేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 19 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ రెబల్ గ్రూప్‌నకు కకోలి ఘోష్ దస్తిదార్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తన మద్దతుదారులైన ఎంపీలతో ఎన్డీయేలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామంపై టీఎంసీ అగ్రనేత కల్యాణ్ బెనర్జీ స్పందించారు. రెబల్ నేతలకు రాజకీయ, నైతిక విలువలు లేవని, వారు బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నారని విమర్శించారు. రెబల్ గ్రూపులో 20 మంది ఉన్నారని ప్రచారం జరిగినా.. చివరకు 19 మంది రెబల్ ఎంపీలున్నట్లు తాజాగా లెక్కతేలింది. వీరిలో మమతకు సన్నిహితులైన ఎంపీలు కూడా ఉండటం విశేషం. మమత కోసం ఎంపీ సీటు త్యాగం చేస్తారనే ప్రచారం జరుగుతున్న యూసుఫ్ పఠాన్ కూడా రెబల్స్ గ్రూపులో చేరారు. దీంతో మమతా బెనర్జీకి షాక్ తప్పేలా లేదు. అటు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమత రాష్ట్రంలో ఏ పదవీ లేకుండా ఉండాల్సి వస్తోంది. ఎంపీగా ఆమె లోక్‌సభకు కూడా వెళ్లలేదు.
List of 19 rebel TMC MPs who have signed a letter to the Lok Sabha Speaker.
Kakoli Ghosh (Barasat)
Jagadish Chandra Basunia (Cooch Behar)
Khalilur Rahaman (Jangipur)
Yusuf Pathan (Berhampore)
Abu Taher Khan (Murshidabad)
Partha Bhowmick (Barrackpore)
Bapi Haldar (Mathurapur)… pic.twitter.com/3jYWNZxjDD— IANS (@ians_india) June 10, 2026
ఎంపీల మద్దతు లేదు కాబట్టి, రాజ్యసభకు కూడా అవకాశాలు తక్కువే. తాజా పరిణామాలపై టీఎంసీ ఘాటుగా స్పందిస్తోంది. టీఎంసీకి మద్దతు ఇవ్వకుంటే ఆ ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టీఎంసీ ఎంపీలు లేఖ ఇస్తే, దాన్ని బీజేపీ ఎందుకు బహిరంగపర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆ పార్టీ ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని టీఎంసీ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

