లక్నో, సెప్టెంబర్ 11: ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో మొత్తం 19మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని లక్నోలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. స్మార్ట్ సిటీ పేరుతో బడ్జెట్ కేటాయించి అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవినితీ, దోపిడికి పాల్పడిందని, అందువల్లే నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.