లక్నో: ఒక ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించారు. చెక్‌పాయింట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. వారిని ఆటో నుంచి కిందకు దించి కౌంట్ చేశారు. ఆటోలో 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి షాక్ అయ్యారు. (19 Passengers Travelling In Auto) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 15న బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళ్తున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. అందులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటాన్ని గమనించారు.
కాగా, చెక్‌పాయింట్ వద్ద ఆ ఆటోను పోలీసులు ఆపారు. అందులో ప్రయాణించిన వారిని కిందకు దిగమని చెప్పారు. వారిని ఒకచోట నిలబెట్టి లెక్కించారు. 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణించినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుని, వారి ప్రాణాలను రిస్క్‌లో పడేసిన ఆ ఆటో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. వారంతా ఎక్కడకు వెళ్తున్నారు అన్నది ఆరా తీశారు.
మరోవైపు ఒక్కొక్కరుగా 19 మంది వ్యక్తులు ఆ ఆటో నుంచి కిందకు దిగిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. పలువురు భిన్నంగా కామెంట్లు చేశారు.
एक ऑटो में कुल 18 सवारी.. चालक को मिला लीजिए तो 19 लोग.. गजब हाल है..
झांसी पुलिस ने फिलहाल ऑटो सीज कर दिया है! pic.twitter.com/1uKB2dg1zB
— Devesh Pandey (@iamdevv23) February 17, 2025