Gas Cylinder Price | కేంద్రం భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెంపు
Gas Cylinder Price | భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను భారీగా పెంచింది.
Gas Cylinder Price | న్యూఢిల్లీ: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను భారీగా పెంచింది. కమర్షియల్ సిలిండర్ ధరలను గతకొన్ని నెలలుగా 10, 20 రూపాయల మేర తగ్గిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక్కసారిగా రూ.200 కుపైగా పెంచింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.209 పెరిగి రూ.1731.50కి చేరింది. ఇక కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉన్నది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.
కాగా, గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరటలభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (Domestic LPG cylinder) ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులేదని కంపెనీలు ప్రకటించాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో దాదాపు ఏడాది తర్వాత గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలింగర్ ధరను రూ.200 వేర కేంద్ర ప్రభుత్వం గత నెలలో తగ్గించిన విషయం తెలిసిందే. అయితే నెల తిరక్కముందే అంతే మొత్తాన్ని వాణిజ్య సిలిండర్లపై వసూలు చేయనుండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

