Coronavirus | కాస్త తగ్గిన వైరస్ వ్యాప్తి.. 3 వేల దిగువకు క్రియాశీల కేసులు
Coronavirus | కొత్త ఏడాది ప్రారంభంలో విజృంభించిన కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 500 పైనే నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 200 దిగువకు పడిపోయాయి.
Coronavirus | కొత్త ఏడాది ప్రారంభంలో విజృంభించిన కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 500 పైనే నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 200 దిగువకు పడిపోయాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 189 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అత్యధికంగా కర్ణాటకలో 61 కేసులు బయటపడినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 35, కేరళలో 25 కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 4,50,22,219కి పెరిగింది. నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,417కి చేరింది. నిన్న ఒక్కరోజే 372 మంది కొవిడ్ (COVID 19) నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,85,998గా ఉంది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసులు మూడువేల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 2,804 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Houthi Rebals | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. అమెరికా నౌకపై క్షిపణితో దాడి
Donald Trump | రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ షో.. ఫస్ట్ విక్టరీ కొట్టిన మాజీ ప్రెసిడెంట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

