Khalistani terrorist | రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం.. ఖలిస్థాన్ తీవ్రవాది పన్నూన్ బెదిరింపులు
Khalistani terrorist | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ మాన్ (Bhagwant Mann)ను చంపేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది (Khalistani terrorist) గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) బెదిరింపులకు పాల్పడ్డాడు.
Khalistani terrorist | ఖలిస్థాన్ ఉగ్రవాది (Khalistani terrorist), నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ మాన్ (Bhagwant Mann)ను చంపేస్తామని హెచ్చరించాడు. జనవరి 26వ తేదీన భగవంత్ మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. గ్యాంగ్స్టర్లు అంతా ఏకమై రిపబ్లిక్ డే (Republic Day) రోజున పంజాబ్ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చాడు.
పంజాబ్‌లో గ్యాంగ్స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బెదిరింపులకు కారణంగా తెలుస్తోంది. ఈ బెదిరింపులపై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పందించారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. పన్నూన్ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, పన్నూన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. గత కొన్ని రోజులుగా భారత్‌కు చెందిన పలువురు నేతలుచంపేస్తామంటూ, ప్రముఖ ఆలయాలు, ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులు చేశాడు. గత నెలలో కూడా పార్లమెంట్ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఇప్పుడు తాజాగా పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read..
Mahesh Babu | మహేష్ బాబు ‘బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’.. వైరలవుతున్న పిక్స్
Donald Trump | రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ షో.. ఫస్ట్ విక్టరీ కొట్టిన మాజీ ప్రెసిడెంట్
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

