Mahesh Babu | మహేష్ బాబు ‘బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’.. వైరలవుతున్న పిక్స్
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన నివాసంలో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ‘సక్సెస్ పార్టీ’ని నిర్వహించారు.
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ సందర్భంగా మహేష్ బాబు తన నివాసంలో ‘సక్సెస్ పార్టీ’ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ దంపతులతోపాటు, నాగవంశీ, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొని సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ (Blockbuster Celebrations) అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. అదేవిధంగా తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు (Happy Sankranthi) తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.
Also Read..
Houthi Rebals | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. అమెరికా నౌకపై క్షిపణితో దాడి
Donald Trump | రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ షో.. ఫస్ట్ విక్టరీ కొట్టిన మాజీ ప్రెసిడెంట్
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

