Donald Trump | రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ షో.. ఫస్ట్ విక్టరీ కొట్టిన మాజీ ప్రెసిడెంట్
Donald Trump | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ (Republican Contest) తరఫున పోటీపడుతున్న యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు.
Donald Trump | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ (Republican Contest) తరఫున పోటీపడుతున్న యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్ ఎన్నికల్లో ట్రంప్ మెజారిటీ ఓట్లు సాధించారు. ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసలో దూసుకుపోయారు. దీంతో రెండో స్థానం కోసం రాన్ డిశాంటిస్, నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది.
ఇదే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం పోటీపడిన భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్.. రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది. అక్కడ ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తున్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం విశేషం. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
వరుసగా మూడోసారి..
ఇక ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ (Joe Biden) చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగారు.
ట్రంప్‌ను నిషేధించిన రెండు రాష్ట్రాలు
అయితే, ఈ సారి ట్రంప్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇటీవలే ట్రంప్‌పై రెండు రాష్ట్రాలు వేటు కూడా వేశాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై దాడికి దిగిన విషయం విదితమే. వారిని సమర్ధించి, హింసను ప్రేరేపించినట్టు ట్రంప్‌పై అభియోగాలున్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. కొలరాడో తీర్పును పాటిస్తూ ఆ రెండు రాష్ట్రాలు ట్రంప్‌పై నిషేధం విధించాయి.
Also Read..
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
Delhi | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం
China Manja | రెండు రోజుల్లో 1,000 పక్షులను బలి తీసుకున్న చైనా మాంజా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

