కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 27 : మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు హార్డ్‌కోర్ మావోయిస్టులు సహా 18 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) 1వ బెటాలియన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురు మావోయిస్టులు సహా 18 మంది లొంగిపోయారని తెలిపారు.
వారిపై రూ.39 లక్షల రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘నియద్ నెల్లనార్’ కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయినట్టు వివరించారు. వీరిలో 1వ బెటాలియన్‌కు చెంది న నలుగురు మావోయిస్టులు అనేక విధ్వ ంసకర ఘటనల్లో పాల్గొన్నట్టు తెలిపారు.