Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం
Massive fire | ఒక బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు దగ్ధమయ్యాయి.
బెంగళూరు: ఒక బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు దగ్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో సంఘనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య తెలిపారు. మంటల్లో కాలిన ప్రైవేట్ బస్సులు రిపేర్ కోసం అక్కడ ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మెకానిక్లు, వెల్డింగ్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారని అన్నారు. అయితే వారంతా పరుగులు తీసి అక్కడి నుంచి బయటపడ్డారని తెలిపారు. పెట్రోల్ వంటి మండే వస్తువులు ఆ డిపోలో పలు చోట్ల ఉన్నాయని తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
Massive fire broken out at least 5 to 10 Buses Gutted near Veerbhadra Nagar in Bengaluru, India 🇮🇳 (30.10.2023)
Source: Nabila Jamal
TELEGRAM JOIN 👉 https://t.co/9cTkji5aZq pic.twitter.com/rN8p0ymSWh— Disaster News (@Top_Disaster) October 30, 2023
Private buses parked in a bus depot in Bengaluru’s Veerabhadranagar catch fire pic.twitter.com/soVNFniqut
— TOI Bengaluru (@TOIBengaluru) October 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- buses
- gutted
- Massive fire
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

