స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏకపక్ష వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ నుంచి గన్‌పార్క్ వద్దకు కాలినకడన వచ్చిన ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఇది శాసనసభనా? గాంధీ భవనా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మూసీ సుందరీకరణ అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.