శనివారం 16 జనవరి 2021
National - Jan 10, 2021 , 09:57:24

దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు

న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 18,645 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,04,50,284కు పెరిగాయి. కొత్త వైరస్‌ నుంచి 19,299 మంది కోలుకొగా.. ఇప్పటి వరకు 1,00,75,950 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 201 మంది మహమ్మారి ప్రభావంతో మృతి చెందగా.. 1,50,999కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,23,335 క్రియాశీల కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. శనివారం ఒకే రోజు 8,43,307 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 18,10,96,622 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది.