లక్నో, ఫిబ్రవరి 21: యూపీలోని సీట్లపై ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 సీట్లలో కాంగ్రెస్కు 17 సీట్లు కేటాయిస్తూ ఒప్పందం కుదరినట్టు ఇరు పార్టీలు బుధవారం ప్రకటించాయి. రాష్ట్రంలోని 17 సీట్లలో కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని, మిగిలిన 63 స్థానాలలో ఎస్పీ, దాని మిత్రపక్ష పార్టీలు పోటీలో ఉంటాయని ఎస్పీ రాష్ట్ర చీఫ్ నరేష్ ఉత్తమ్ పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాజ్ సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు.