Indians onboard ship | ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది
Indians onboard ship | ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నది.
న్యూఢిల్లీ/ టెహ్రాన్: ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. (Indians onboard ship) దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నది. ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ ఎంసీఎస్ ఏరీస్పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం దాడి చేశారు. హెలికాప్టర్ నుంచి దానిపై దిగిన కమాండోలు ఆ ఓడను స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ తీరంలోని హార్ముజ్ జలసంధి సమీపం నుంచి ఇరాన్‌కు మళ్లించారు.
కాగా, ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఆ కార్గో షిప్లో 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 17 మంది భారతీయులు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న ఓడలోని 17 మంది భారతీయ సిబ్బంది భద్రత, సంక్షేమం, విడుదల కోసం ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంతో దౌత్య మార్గాల ద్వారా భారతీయ సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

