అహ్మదాబాద్: నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ రాష్ట్ర మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వారి రాజీనామాలను ఆమోదించారు.
దీంతో మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి మార్గం సుగమం అయింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ శుక్రవారం జరుగుతుంది.