న్యూఢిల్లీ: జ్వరం, జలుబు, అలర్జీ, నొప్పులకు విస్తృతంగా వినియోగించే 156 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(Fixed Dose Combination) మందులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ మందుల వల్ల మనుషులకు రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఎఫ్డీసీ మందుల్లో.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. కాక్టెయిల్ డ్రగ్స్‌గా వీటిని పిలుస్తుంటారు. నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 12వ తేదీన కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసింది.
పెయిన్ కిల్లర్‌గా పాపులర్ అయిన అసిక్లోఫినాక్ 50ఎంజీ ప్లస్ పారాసిటమాల్ 125ఎంజీ ట్యాబ్లెట్ నిషేధి డ్రగ్ జాబితాలో ఉన్నది. ఈ ఫార్ములాతో తయారు అయ్యే ట్యాబ్లెట్‌ను దాదాపు అన్ని మేటి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్నాయి. నిషేధి జాబితాలో .. మెఫనామిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్, సిట్రిజన్ హెచ్‌సీఎల్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ ఫినైలిప్రైన్ హెచ్‌సీఎల్, లివోసిట్రిజన్ ప్లస్ ఫినైలిప్రైన్ హెచ్‌సీఎల్, పారాసిటమాల్ ప్లస్ క్లోరోఫినరమైన్ మాలియేట్ప్లస్ ఫినైల్ ప్రొపనోలమైన్, కామిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ 25ఎంజీ ప్లస్ పారాసిటమాల్ 300 ఎంజీ ఉన్నాయి.