జైపూర్: రాజస్థాన్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాన్ని సీజ్ చేశారు. ఆ రాష్ట్రంలో టోంక్ ప్రాంతంలో ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. మారుతీ కారులో సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్(Amonium Nitrate) తీసుకెళ్తున్నారు. యూరియా బస్తీల్లో అమోనియం నైట్రేట్‌ను తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు సుమారు 200 ఎక్స్‌ప్లోజీవ్ బ్యాటరీలు, 1100 మీటర్ల పొడువైన వైరును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఒకర్ని సురేంద్రగా, మరో వ్యక్తిని సురేంద్ర మోచీగా గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.