న్యూఢిల్లీ : ఢిల్లీ రైల్వేస్టేషన్(New Delhi railway station Stampede)లో శనివారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 15 మంది మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కుంభమేళాకు వెళ్లే భక్తులతో రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోవడంతో భారీ తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రయాగ్రాజ్ వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయనే వదంతులే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.