Girl Collapses While Playing | రెస్టారెంట్లో భోజనం తర్వాత.. ఆడుతూ కుప్పకూలి బాలిక మృతి
Girl Collapses While Playing | వేసవి సెలవుల నేపథ్యంలో ఒక బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబ సభ్యులు ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. భోజనం తర్వాత తోటి పిల్లలతో కలిసి ఆడుతూ, పరుగెత్తిన ఆ బాలిక కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
అహ్మదాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో ఒక బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబ సభ్యులు ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. భోజనం తర్వాత తోటి పిల్లలతో కలిసి ఆడుతూ, పరుగెత్తిన ఆ బాలిక కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జామ్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల ఆనంది మోదీ, వేసవి సెలవుల సందర్భంగా రాజ్‌కోట్‌లోని మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం ఆ బాలికతో సహా ఆ కుటుంబ సభ్యులు ఒక రెస్టారెంట్‌కు వెళ్లి డిన్నర్ చేశారు.
కాగా, భోజనం తర్వాత ఆ రెస్టారెంట్ ఆవరణలో ఇతర పిల్లలతో కలిసి ఆనంది ఆడింది. ఈ సందర్భంగా అటూ ఇటూ పరిగెత్తిన ఆ బాలిక ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆనంది గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Collapses
- Girl
- Gujarat
- heart attack
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

