కొత్తగూడెం ప్రగతిమైదాన్, మార్చి 3 : మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తి చెందిన ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన పార్టీ మిలీషియా, సీఎన్ఎం సభ్యులు 14 మంది లొంగిపోయినట్టు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా పామేడ్ పరిధి మంగలతోరుకు చెందిన మడివి భీమా, ఆర్పీసీ సీఎన్ఎం ఎర్రపల్లి అధ్యక్షులు సోడి ఉంగా, మడివి అడుమ, కుంజాం కోసా, కోవాసి నంద, మడివి భీమా, మాసా, బీజాపూర్ జిల్లా దొడ్డితుమ్నార్కు చెందిన కుంజాం లక్మా, కస్తూరిపాడుకు చెందిన వెట్టి లక్కే, చుక్కయ్య, కోసా, భీమా, సోడి రాధిక, కుహ్రామికాజల్ లొంగిపోయిన వారిలో ఉన్నట్టు వివరించారు. కాగా బీజాపూర్ జిల్లా గంగలూరు ఏరియా కమిటీ కార్యదర్శి దినేశ్ తన భార్య, కుమార్తెతో వచ్చి లొంగిపోయినట్టు తెలిసింది.