భోపాల్: మధ్యప్రదేశ్లో కార్బైడ్ గన్ ప్రజల పాలిట ముప్పుగా పరిణమించింది. దీపావళి రోజు ఆ గన్తో వేడుకలు చేసుకున్న 14 మంది చిన్నారులు కంటి చూపు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 122 మంది తీవ్ర గాయాలపాలై దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల ప్లాస్టిక్ పైపులతో స్థానికంగా తయారు చేసే కార్బైడ్ గన్ పట్ల చిన్నారులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రమాదకరమైన కార్బైడ్ గన్లపై ప్రభుత్వం నిషేధం విధించినా వ్యాపారులు లెక్కచేయకుండా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు.