న్యూఢిల్లీ: దేశంలో 1,365 ఐఏఎస్, 703 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,042 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), 301 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ అఖిల భారత స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కేంద్రం నిరంతర ప్రక్రియగా సాగిస్తున్నదని చెప్పారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు.