న్యూఢిల్లీ : మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 120 మంది ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం లోక్‌సభ స్పీకర్‌కు నోటీస్ సమర్పించారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, పార్టీ లోక్‌సభ నాయకుడు టీఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన నోటీసును అందజేశారు.
మద్రాస్ హైకోర్టు జడ్జి స్వామినాథన్ నిష్పాక్షికత, పారదర్శకతపై పలు ప్రశ్నలు లేవనెత్తిన ఈ అభిశంసన తీర్మానంలో తన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ అడ్వకేట్, న్యాయవాదులకు అనుకూలంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. తిరుపరకుండ్రంలోని కొండపై ఆల యానికి సమీపంలో కార్తీక దీపం వెలిగించడంపై జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ ప్రభావం ఉందని ఇండియా కూటమి ఆరోపిస్తున్నది.