జైపూర్: పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లో పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక కొంత మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. (Students Faint) వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పందించిన అధికారులు ఆ కోచింగ్ సెంటర్‌కు సీల్ వేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి గోపాల్‌పూర్‌లోని ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్లో పొగలు వ్యాపించాయి. ఆ ప్రాంగణంలోని తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయి. దీంతో పొగలకు ఊపిరాడక సుమారు 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న ఇద్దరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆ సమయంలో కోచింగ్ సెంటర్లో సుమారు 350 మంది విద్యార్థులున్నారు. ఈ సంఘటనపై విద్యార్థులు భయాందోళన చెందారు. వారంతా ఆ కోచింగ్ సెంటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్డుపై గుమిగూడారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విష వాయువులుగా భావిస్తున్న పొగలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ పక్కనే ఉన్న ఇంట్లోని వంటగది నుంచి గ్యాస్ లీక్ కావడం లేదా సమీపంలోని డ్రైనేజీ నుంచి విష వాయువులు వెలువడి ఉంటాయని అనుమానిస్తున్నారు.
మరోవైపు సోమవారం ఉదయం ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు, పేరెంట్స్ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కోచింగ్ సెంటర్ ఉన్న భవనాన్ని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికాకారులు సీజ్ చేశారు. సమీపంలోని పేయింగ్ గెస్ట్‌కు కూడా సీల్ వేశారు. విష వాయువుల వ్యాప్తిపై విచారణ పూర్తయ్యే వరకు ఈ రెండు భవనాలు సీజ్‌లో ఉంటాయని అధికారులు తెలిపారు.
The horrifying incident at Jaipur’s #Utkarsh_Coaching exposes the harsh reality of India’s coaching mafia.
Hundreds of students crammed into spaces meant for half their number, collapsing health standards, and authorities remain silent.Parents, trapped in a system obsessed with… pic.twitter.com/daN1tD7ZBL
— Kumaon Jagran (@KumaonJagran) December 15, 2024