తిరువనంతపురం: కేరళలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా మహమ్మారి ( Corona in Kerala ) మళ్లీ విజృంభించింది. ఇవాళ కొత్తగా 7,540 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, కొత్తగా నమోదైన కేసుల కంటే ఎక్కువగా రికవరీలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 7,841 మంది కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. ఇక సవరించిన కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ఇవాళ కొత్తగా 211 కరోనా మరణాలు (గడిచిన 24 గంటల్లో మాత్రం 48 మంది మరణించారు) చోటుచేసుకున్నాయి.
దాంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,621కి పెరిగింది. ప్రస్తుతం అక్కడ 70,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో కేరళలో మొత్తం 76,380 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.