న్యూఢిల్లీ, జూలై 24: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మొత్తం 112 మంది ఎయిరిండియా పైలట్లు సిక్ లీవ్ తీసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ గురువారం లోక్సభలో వెల్లడించారు. ముఖ్యంగా ఈ విమాన దుర్ఘటన జరిగిన తర్వాత పైలట్ల మానసిక ఆరోగ్యాన్ని గుర్తించటం చాలా ప్రధానంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలకు సంబంధించి బుధవారం ఎయిరిండియాకు డీజీసీఏ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.