మీర్జాపూర్: శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17 అయోధ్య రామాలయంలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి 1,11,111 కిలోల లడ్డూలను పంపనున్నట్లు దేవ్హ్ర హన్స్ బాబా ట్రస్ట్ ప్రకటించింది. కాశీ విశ్వనాథ ఆలయం, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాలకు ప్రతి వారం ఇలా ప్రసాదం కోసం లడ్డూలను తమ ట్రస్ట్ పంపుతుందని ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు 40 వేల కిలోల లడ్డూలను పంపామని గుర్తు చేశారు.