ముంబై: మహారాష్ట్రలో శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబైలోని చెంబూరులో కొండచరియలు విరిగిపడి 12 మంది మృతిచెందారు. చెంబూరులోని భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో 12 మంది మరణించగా, అనేక ఇండ్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని శిథిలాల నుంచి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను రాజవాడి, సమీప దవాఖానలకు తరలించారు.
ముంబైలోని విఖ్రోలి, చెంబూర్‌లో శనివారం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రమాదాలు సంభవించాయి. విఖ్రోలి సూర్యానగర్ ప్రాంతంలో నాలుగు ఇండ్లు కూలిపోయాయి.
#WATCH | Maharashtra: Rainwater entered Mumbai's Borivali east area following a heavy downpour this morning pic.twitter.com/7295IL0K5K
— ANI (@ANI) July 18, 2021