చండీగఢ్ : పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాను పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు ఆదివారం చెప్పారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌ను రవాణా చేయడానికి జల మార్గాలను ఉపయోగించుకుంటున్నారన్నారు. విదేశీ డ్రగ్ స్మగ్లర్‌తో సంబంధాలు గల ఇద్దరిని అరెస్ట్ చేసి, 105 కిలోల హెరాయిన్, టైర్లలోని పెద్ద రబ్బర్ ట్యూబులు, ఐదు విదేశీ తయారీ, ఒక దేశవాళీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.