బెంగుళూరు: కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని సహకార బ్యాంకులపై ఐటీ అధికారులు దాడులు చేపట్టగా, దాదాపు రూ.వెయ్యి కోట్ల బోగస్ సొమ్ము ఉన్నట్టు బయటపడింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కాంట్రాక్టర్లు, పెద్ద కంపెనీలకు చెందిన సహకార బ్యాంకు ఖాతాల్లో పెద్దఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయని ఐటీ అధికారులు చెప్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా నల్లధనం తెల్లధనంగా మారుతున్నదని అనుమానం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొన్నది.