UP rains | యూపీలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం.. 100కు చేరిన మృతుల సంఖ్య..!
UP rains | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మండువేసవిలో అకాల వర్షాల (Unseasonal rains) తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది.
UP rains : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మండువేసవిలో అకాల వర్షాల (Unseasonal rains) తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 100 మంది మృతిచెందారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. 114 జంతువులు మరణించాయి. 87 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ఈ విషయాలను వెల్లడించింది. అకాల వర్షాలవల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరాతీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారని, వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్, భదోహి, సోన్‌భద్ర, ఫతేపుర్ తదితర జిల్లాల్లో గాలివాన బీభత్సం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో 21 మంది, భదోహిలో 16 మంది, ఫతేపుర్‌లో 11 మంది, సంత్ రవిదాస్ నగర్లో 14 మంది, మీర్జాపుర్‌లో 10 మంది మృతి చెందినట్లు ఆయా జిల్లాల యంత్రాంగాలు వెల్లడించాయి.
ఆయా జిల్లాల్లో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సాధారణంగా మే నెలలో ఉత్తర భారతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలాచోట్ల సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఆ సమయంలో భూఉపరితలంపై ఉండే గాలి విపరీతంగా వేడెక్కుతుంది. అది వేగంగా కదులుతూ ఇతర దిశల నుంచి తడిగాలిని లాగేసుకుంటుంది. ఈ రెండు కలిసి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశమంతా విస్తరిస్తాయి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే భారీ వర్షం, వడగళ్లు, పిడుగులు పడుతాయి.
ఇప్పుడు యూపీలో ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బరేలీ జిల్లాలో బలమైన ఈదురు గాలుల కారణంగా ఓ వ్యక్తి పతంగిలా పైకి ఎగిరి కింద పడ్డాడు. గాలిదుమారం రావడంతో సదరు వ్యక్తి ఓ షెడ్డును పట్టుకుని నిలబడ్డాడు. అయితే గాలి తీవ్రతకు షెడ్డుతో సహా ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో తీవ్ర గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

