అహ్మదాబాద్: పదేళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలుడు పరిచయమయ్యాడు. వీరిద్దరూ ఆన్లైన్లో ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు. (Girl elopes with boy) బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు వెతికి వారిని పట్టుకున్నారు. వారిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలించారు. గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధన్సురా గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక ఐదో తరగతి చదువుతున్నది. తల్లి మొబైల్ ఫోన్లోని ఇన్‌స్టాగ్రామ్‌ను ఆమె వినియోగించింది. మరో గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో ఆ బాలికకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ ఆన్లైన్లో ప్రేమించుకున్నారు.
కాగా, డిసెంబర్ 31న ఆ బాలిక, బాలుడు కలిసి తమ స్నేహితుల సహాయంతో ఇళ్ల నుంచి పారిపోయారు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కిడ్నాప్ అయినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు బాలిక మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో పరిచయమైన బాలుడితో కలిసి వెళ్లినట్లు గ్రహించారు. వారి ఆచూకీని గుర్తించి పట్టుకున్నారు. వారిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలించారు. బాలిక తల్లి మొబైల్ ఫోన్లోని ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ బాలుడితో ఆమెకు పరిచయమైందని పోలీసులు తెలిపారు. అయితే బాలిక తండ్రికి సోషల్ మీడియా గురించి ఏ మాత్రం అవగాహన లేదని వెల్లడించారు.