ముంబై, సెప్టెంబర్ 6: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ 10 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండెనొప్పికి లోనై మరణించాడు. ఈ విషాద ఘటన కొల్హాపూర్ జిల్లాలోని కొడోలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. శ్రావణ గావడే అనే బాలుడు తన స్నేహితులతో కలసి వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు.
తల్లి ఒడిలో తల పెట్టుకున్న ఆ బాలుడు తీవ్రమైన గుండెనొప్పి వచ్చి అక్కడికక్కడే మరణించాడు. మరో ఘటనలో ఓ 45 ఏండ్ల మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారుడు ఆగస్టు 31న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గుండెపోటుకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. దవాఖానలో చేరి చికిత్స తీసుకున్నాడు. అదే కోటా ఆందోళనలో పాల్గొన్న విజయ్‌కుమార్ చంద్రకాంత్ ఘోగారే అనే నిరసనకారుడు గుండెపోటుతోమరణించాడు.