ISRO |ఇంపాల్, మే 12: భారతదేశ భద్రతలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. వ్యూహాత్మక భద్రత పర్యవేక్షణలో మొత్తం 10 ఉపగ్రహాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
ఇంపాల్లోని ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో వీ నారాయణన్ మాట్లాడుతూ మన పొరుగు దేశాల గురించి తెలిసిందే. కాబట్టి మన దేశ భద్రతను శాటిలైట్స్ ద్వారా పర్యవేక్షించుకోవాల్సిన అవసరముంది. భారత్కు 7000 కిలో మీటర్ల సముద్రతీరం ఉం ది. అలాగే ఉత్తరాది సరిహద్దును నిరంతరం పరిశీలిస్తుండాలి. శాటిలైట్, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనకు అది సాధ్యం కాదు అని తెలిపారు.