కేంద్రంలో 10 లక్షల ఖాళీలు.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి
కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారు..
- రైల్వే శాఖలో 2.93 లక్షలు
- రక్షణ శాఖలో 2.64 లక్షలు
- లోక్‌సభలో కేంద్రం వెల్లడి
అటు ప్రైవేటు పరం..
ఇటు ఖాళీల పర్వం..
ఇది కేంద్రం నిర్వాకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలోనూ తీవ్ర అలసత్వం వహిస్తున్నది. కేంద్ర శాఖల్లో ఏకంగా 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర శాఖలు, పీఎస్‌యూల్లో ఖాళీల సంఖ్యపై కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. మొత్తంగా కేంద్రంలో 9.79 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయని, అందులో గ్రూప్-ఏ పోస్టులు 23,584, గ్రూప్-బీ పోస్టులు 1,18,807, గ్రూప్-సీ పోస్టులు 8,36,936 ఉన్నాయని వివరించారు.
ఈ ఏడాది ఆగస్టు నాటికి రైల్వే శాఖలో 2,93,943, రక్షణ (సివిల్) శాఖలో 2,64,704, హోంశాఖలో 1,43,536 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ‘రైల్వేలో మొత్తం 15,14,007 పోస్టులు ఉండగా, 2,93,943 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వేలో 12,20,064 మంది ఉద్యోగులు ఉన్నారు. డిఫెన్స్ (సివిల్)లో 6,46,042 పోస్టులు ఉండగా, 2,64,707 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోంశాఖలో 10,85,728 పోస్టుల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని వెల్లడించారు.
గత ఐదేండ్లలో యూపీఎస్సీ, ఎస్సెస్సీ ద్వారా కేంద్రం 2,46,914 పోస్టులనే భర్తీ చేసింది.
కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు
గ్రూప్-ఏ – 23,584
గ్రూప్-బీ – 1,18,807
గ్రూప్-సీ – 8,36,936
మొత్తం – 9,79,327

పీఎంవోలో 129 ఖాళీలు

ప్రధానమంత్రి కార్యాలయంలో 446 పోస్టులు ఉండగా, 129 ఖాళీలు ఉన్నాయని, రాష్ట్రపతి సెక్రటేరియట్లో 380 పోస్టులకుగానూ 91 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా 1.47 లక్షల కొత్త నియామకాలు జరిగాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

