Baramulla | జమ్మూకశ్మీర్లోని బారాముల్లా (Baramulla) జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి (Army Foils Infiltration Attempt). ఈ సందర్భంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు (Terrorist Killed) అధికారులు తెలిపారు.
శుక్రవారం ఉదయం జిల్లాలోని ఉరీ ప్రాంతంలో సబురా నాలా రుస్తుం వద్ద నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. అక్కడ చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపి ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.
Also Read..
Election Manifesto | సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
Atishi | ఢిల్లీ మంత్రి అతిషికి ఈసీ నోటీసులు
KTR | ఎండ వేడిమికి రిఫ్రెష్.. పాఠశాల పిల్లలతో కలిసి ఫ్రూట్ జ్యూస్ తాగిన కేటీఆర్