Cloudburst | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలకు రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు ముగ్గురు గాయాలపాలయ్యారు.
కుల్గాం (Kulgam) జిల్లాలోని దమ్హాల్ హంజిపోరా ప్రాంతంలో గురువారం ఉదయం క్లౌడ్ బరస్ట్ కారణంగా వర్షం ముంచెత్తింది. దీంతో వరదలు సంభవించాయి. ఈ వరదలకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని ముఖ్తార్ అహ్మద్ చౌహాన్గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిలో ఒకరిని రఫాకత్ అహ్మద్ చౌహాన్గా గుర్తించారు.
Also Read..
PM Modi | బంగ్లాదేశ్లో హిందువుల, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల ఆందోళన : పీఎం మోదీ
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవం.. పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం
PM Modi | ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.. సద్వినియోగం చేసుకోవాలి : ప్రధాని నరేంద్ర మోదీ