Under Construction Bridge | కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. ఒకరు మృతి, చిక్కుకుపోయిన 30 మంది
బీహార్లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన (Under Construction Bridge) కుప్పకూలింది. దీంతో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా మరియు బకౌర్ మధ్య కోసీ నదిపై (Kosi river) భారీ వంతెనను నిర్మిస్తున్నారు.
పాట్నా: బీహార్లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన (Under Construction Bridge) కుప్పకూలింది. దీంతో ఒకరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా మరియు బకౌర్ మధ్య కోసీ నదిపై (Kosi river) భారీ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని దవాఖానకు తరలించామని చెప్పారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై భగల్పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2014లో శంకుస్థాపన చేశారు. 2019లో పనులు పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
#UPDATE | Supaul, Bihar: One died and nine injured as a portion of an under-construction bridge collapsed near Maricha between Bheja-Bakaur: Supaul DM Kaushal Kumar https://t.co/DhsS9ZCCws
— ANI (@ANI) March 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

