న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమా న ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ రూ.కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తుందని ఎయిరిండియా, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎక్స్‌లో ప్రకటించారు. అలాగే గాయపడిన వారి వైద్యానికి అయ్యే ఖర్చును తమ సంస్థ భరిస్తుందని, వారి భద్రత, సహాయానికి కావాల్సిన పూర్తి సహకారం అందజేస్తామని చెప్పారు.
ప్రమాదంలో ధ్వంసమైన బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని, ఈ అనూహ్యమైన సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.