న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో దినసరి కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-21 మధ్య మూడేండ్ల వ్యవధిలో 1.12 లక్షల మంది దినసరి కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లోక్సభలో తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో ప్రకారం 66,912 మంది గృహిణులు, 53,661 మంది స్వయం ఉపాధి పొందుతున్న వారు, 43,420 మంది ఉద్యోగులు, 43,385 మంది నిరుద్యోగులు సైతం ఈ మూడేండ్ల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అలాగే 35,950 మంది విద్యార్థులు, 31,389 మంది వ్యవసాయ కార్మికులు సైతం బలవన్మరణాలకు పాల్పడ్డారు.