న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వాయు కాలుష్యంతో వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎలా తగ్గిపోతుందన్న విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుకు, శుక్రకణాల ఉత్పత్తికి మధ్య సంబంధం ఉంటుంది. కాలుష్య కారకాలు శరీరంలో ప్రవేశించినప్పుడు మెదడులోని తెల్లరక్తకణాలు ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. పదే పదే కాలుష్యానికి గురవడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా శుక్రకణాల ఉత్పత్తి నెమ్మదిస్తుంది. ఎలుకల్లో పరిశోధనలు నిర్వహించి శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.