న్యూఢిల్లీ : ప్రభుత్వ ఫైళ్లే కాదు, చట్టసభల్లోనూ పలు బిల్లులు మోక్షం లేకుండా ఎదురుచూస్తున్నాయి. రాజ్యసభలో 19 ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు ఒకటి 1992 నుంచి పెండింగ్‌లో ఉంది. శాశ్వత సభ అయిన రాజ్యసభ ఎన్నడూ రద్దవ్వదు. ప్రతి రెండేండ్ల కోసారి సభలోని మూడోవంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఆ సభ రద్దయినప్పుడు ఆటోమెటిక్‌గా అవి కూడా రద్దవుతుంటాయి. అయితే రాజ్యసభ శాశ్వతం కాబట్టి బిల్లులు రద్దయ్యే ప్రసక్తి లేకపోవడంతో సభతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులు కూడా కొనసాగుతూ ఉంటాయి.