నేవి ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.2 ఓవర్లలో 169/2 స్కోరు చేసింది.
కెప్టెన్ స్మృతి మందన(61 బంతుల్లో 96, 13ఫోర్లు, 3సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా, జార్జియా వోల్(54 నాటౌట్) ఆకట్టుకుంది. కాప్(1/21), నందని(1/34) ఒక్కో వికెట్ తీశారు. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 166 ఆలౌటైంది. షెఫాలీవర్మ(62), హామిల్టన్(36) ఆకట్టుకున్నారు. బెల్(3/26), సత్గరె(3/27) మూడేసి వికెట్లు తీశారు.