కావలసిన పదార్థాలు
మొలకెత్తిన పెసలు: కప్పు
బీట్రూట్ : ఒకటి
ఆలుగడ్డలు : రెండు చిన్నవి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి: పావుస్పూన్ చొప్పున
బొంబాయి రవ్వ: రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
నూనె: రెండు టేబుల్
కారం: ఒక స్పూన్
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం
బీట్రూట్, ఆలుగడ్డ కడిగి కాస్త పెద్ద ముక్కలుగా తరిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. మొలకెత్తిన పెసలను కూడా ఉడికించి పెట్టుకోవాలి. వీటన్నింటినీ ముద్దగా చేసి అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి గరం మసాలా, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. కొత్తిమీరను కడిగి సన్నగా తరిగి ఈ మిశ్రమంలో కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కట్లెట్ల రూపంలో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బొంబాయి రవ్వని తీసుకొని పరిచినట్టుగా చేయాలి. తయారుచేసి పెట్టుకున్న కట్లెట్ల ముద్దను ఇందులో అటు ఇటు పొర్లించాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఈ కట్లెట్లను రెండు వైపులా బాగా కాల్చుకుంటే సరి! నచ్చిన చట్నీ లేదా సాస్‌తో కలిపి ఆరోగ్యకరంగా ఇంట్లోనే కట్లెట్ లాగించేయొచ్చు.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు